![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో కొత్త కంటెస్టెంట్స్ రావడంతో హౌస్ లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తోంది. తనూజ, కళ్యాణ్ మొదటి వారం క్రేజ్ ఉన్న పెయిర్. అందరు కళ్యాణ్, తనూజ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎక్స్ పెక్ట్ చేసారు. కానీ తనూజ కళ్యాణ్ కి ఛాన్స్ ఇవ్వలేదు. అలాగని కళ్యాణ్ కూడా అలాంటి అడ్వాంటేజ్ ఏం తీసుకోవడం లేదు. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళందరు వీళ్లపై కాన్సన్ట్రేషన్ పెట్టారు.
తనూజని నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు. మాధురి, రమ్య మాట్లాడకున్న వీడియో చూపిస్తాడు. అందులో తనూజ, కళ్యాణ్ కి అంత లీనియన్స్ ఇచ్చింది.. కళ్యాణ్ చెయ్యి వేస్తుంటే తను ఇబ్బంది పడుతుంది.. అయినా చెయ్యి వేస్తున్నాడు కళ్యాణ్. తను అలా చేస్తుండంటే అంత లీనియన్స్ ఇచ్చే ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అని మాధురి, రమ్య మాట్లాడుకుంటారు. అది చూసి తనూజ షాక్ అవుతుంది. సర్ నేను అందరికి ముందే క్లారిటీ ఇచ్చాను సర్. కళ్యాణ్ రాగానే నేను అంటే ఇష్టమని చెప్పడంతో అందరు అలా అనుకుంటున్నారు.. నేను క్లారిటీ తో ఉన్నానని తనూజ చెప్తుంది.
ఆ తర్వాత కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అని రమ్య, మాధురి మాట్లాడుకున్న వీడియోని కళ్యాణ్ కి చూపిస్తారు. చూసావా హౌస్ లో ఎలా అనుకుంటున్నారో నీ ముందు అనలేదు.. నీ వెనకాల మాట్లాడుకుంటున్నారని నాగార్జున చెప్తాడు. తనూజ క్లారిటీగా ఉందని పోలింగ్ చేస్తే అందరు తనూజకి సపోర్ట్ గా పోలింగ్ చేస్తారు. అందరి మాటలు దృష్టిలో పెట్టుకొని తనూజ ఆట మారుతుందో లేదో చూడాలి మరి.
![]() |
![]() |